|

అందరికి నమస్కారం... ! మీరు చూస్తున్నారు డీపీ టెక్ దునియ తెలుగు బ్లాగర్.♗


➤ పెళ్లి రోజా , బర్త్ డే నా ,సెలెబ్రేషన్ ఏదైనా మీ గ్రీటింగ్స్ / శుభాకాంక్షలు ఇప్పుడు మన బ్లాగర్ లో ఫ్రీ ఫ్రీ ఫ్రీ ! కేవలం మార్చి నెల మాత్రమే , మరి ఎందుకు ఆలస్యం వెంటనే మీ డీటెయిల్స్ వాట్స్ ఆప్ చేయండి ⇙

ఇది ధైర్యంగా ఎదుర్కోవాల్సిన సమయం: చిరంజీవి


ప్రాణాంతక మహమ్మారి కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్‌ బారిన ఎప్పుడు, ఎలా పడతామోనని ప్రజలంతా భయాందోళనకు గురవుతున్నారు. దీని నుంచి జాగ్రత్తగా ఉండాలంటూ ప్రముఖులు, సెలబ్రెటీలు ప్రజలకు సూచనలు ఇస్తున్నారు. బాలీవుడ్‌ నుంచి కోలివుడ్‌ వరకూ ప్రముఖ నటి నటులంతా తమ అభిమానులకు తగిన సలహాలు సూచనలు ఇస్తున్నారు. ఈ క్రమంలో తాజా మెగాస్టార్‌ చిరంజీవి కరోనా వైరస్‌ నుంచి అప్రమత్తంగా ఉండాలంటూ తన అభిమానులకు గురువారం వీడియో ద్వారా సందేశం ఇచ్చారు. కరోనా కష్టాలు అన్నీ ఇన్నీ కాదయా! కరోనా ప్రాణాంతకం కాకపోవచ్చు కానీ నిర్లక్ష్యం చేస్తే మహమ్మారిగా మారే ప్రమాదం ఉందని చిరంజీవి హెచ్చరించారు. ఈ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. ‘అందరికీ నమస్కారం.. యావత్‌ ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తున్న సమస్య కరోనా వైరస్‌.  అయితే దీని వల్ల మనకేదో అయిపోతుందన్న భయం కానీ..  మనకేం కాదనే నిర్లక్ష్యం కానీ రెండు పనికి రావు. దీని నుంచి జాగ్రత్తగా ఉంటూ ధైర్యంగా ఎదుర్కొవాల్సిన సమయం ఇది. ఈ ఉధృతం తగ్గే వరకూ జనసముహానికి దూరంగా ఉండండి’ అని సూచించారు. అంతేగాక ఇంట్లో ఉండి వ్యక్తిగతం కూడా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ క్రమంలో మోచేతి వరకూ వీలైనన్ని సార్లు సబ్బుతో లేదా హ్యాండ్‌ వాష్‌లతో కనీసం 20 సెకన్ల పాటు చేతులు కడుక్కోవాలని సూచించారు.
‘‘తుమ్మినా, దగ్గినా కర్చీఫ్‌ కానీ టిష్యూ పేపర్‌ను అడ్డు పెట్టుకోవడం తప్పనిసరి. ఒక్కసారి వాడిన టిష్యూ పేపర్‌ను మరోసారి వాడకుండా.. మూత ఉన్న చెత్త బుట్టలో వేయడం శ్రేయస్కరం. మీ చేతులను కళ్లకు, ముక్కుకు, నోటికి తగలకుండ జాగ్రత్త వహించండి. బయటకు వెళ్లినప్పుడు మీ దగ్గు, జలుబు ఇతరులకు సోకకుండా ముఖానికి మాస్క్‌లు ధరించండి. ఒకవేళ అలసట, నీరసం జ్వరం ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి. అలాంటి పరిస్థితులు తలెత్తకుండా చేసే బాధ్యత మనందరి మీద ఉంది. అలాగే ఎవరికీ షేక్‌ హ్యాండ్‌ ఇవ్వకుండా మన సాంప్రదాయం ప్రకారం నమస్కారం చెబుదాం’’ అంటూ చెప్పుకొచ్చారు.
కాగా గురువారం ఉదయం 10 గంటల వరకు దేశంలో 168 కరోనా కేసులు నమోదైనట్లు భారత ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ప్రధాని మోదీతో సహా..అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే మోదీతోపాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేడు అధికారులతో అత్యున్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేయనున్నారు

No comments:

Post a Comment