ఆరోగ్యము & చిట్కాలు
ఆరోగ్యకరమైన జీవితానికి మంచి నిద్ర కూడా చాలా అవసరం. నిద్రలేకపోవడం వల్ల ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. కానీ, నేటి బిజీ బిజీ పనులతో నిద్ర అనేదే కష్టంగా మారింది. మరి అలా కాకుండా హ్యాపీగా నిద్రపోవాలంటే ఏం చేయాలి.. ముఖ్యంగా ఏ ఆహార పదార్థాలు తినాలో ఇప్పుడు చూద్దాం..
నిద్ర అనేది ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యం. ఇది ఎన్నో ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది. అంతేకాకుండా మీ బ మెదడు, జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంతో పాటు మీ రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
ప్రి ఒక్కరిరూ కూడా రోజుకి కనీసం 7 నుంచి 9 గంటల నిద్ర అనే తప్పనిసరి. కానీ, చాలా మంది కూడా అనేక కారణాల వల్ల నిద్రపోరు. ఇలాంటి వారు ఆహారంలోకి కొన్ని మార్పులను చేయడం వల్ల ఆదమరిచి నిద్రపోతారని చెబుతున్నారు నిపుణులు. అలాంటి ముఖ్యమైన 9 ఆహారపదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
బాదం
అనేక పోషకాలకు అద్భుతమైన మూలం బాదం. ఇందులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగి ఉంటాయి. వీటిని రెగ్యులర్‌గా తింటే టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు వంటివి కూడా దరిచేరవని చెబుతున్నారు నిపుణులు. ఆరోగ్యకరమైన మోనోశాచురేటెడ్ ఆసిడ్స్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్స్ దీనికి కారణమని చెప్పొచ్చు. సుఖనిద్ర కావాలంటే బాదం తినాలని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే బాదంలో నిద్రను నియంత్రించే హార్మోన్ మెలటోనిన్ ఉంటుంది. ఇది సుఖ నిద్రని అందిస్తుంది. మెగ్నీషియం అనేది మంచినిద్రను అందిస్తుంది. ఇది బాదంలో ఎక్కువ మొత్తంలో ఉంటుంది. నిద్రకు అంతరాయం కలిగించే కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ స్థాయిలను తగ్గించడంలో కూడా బాదం సాయపడుతుంది. బాదంను ఎక్కువశాతంలో తీసుకోవడం వల్ల హ్యాపీగా నిద్రపోతారు.
చేపలు..
సాల్మన్, ట్యూనా, ట్రౌట్, మాకేరెల్ వంటి చేపలు తినడం ఆరోగ్యానికి మంచిది. వీటి ప్రత్యేకత ఏమిటంటే ఇందులో ఎక్కువగా విటమిన్ డి కంటెంట్ ఉంటుంది. ఉదాహరణకు, సాల్మొన్‌లో విటమిన్ డి ఉంటుంది, ఇది మీ రోజువారీ అవసరాలలో 50 శాతం కంటే ఎక్కువ అని చెప్పొచు. కొవ్వు చేపలలో ఆరోగ్యకరమైన ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ప్రత్యేకంగా EPA, DHA, రెండూ కడుపులో మంటను తగ్గిస్తాయి. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు గుండె జబ్బుల నుండి కూడా రక్షిస్తాయి. అదే విధంగా, మెదడు ఆరోగ్యాన్ని పెంచుతాయి.
నిద్ర పోయేముందు చేపలు తింటే హాయిగా నిద్రపోతారు. కానీ, నిద్రను మెరుగుపర్చడానికి కొవ్వు చేపల సామర్థ్యం గురించి ఖచ్చితమైన నిర్ధారణకు మరిన్ని అధ్యయనాలు అవసరం.
టర్కీ
టర్కీ రుచికరమైన పోషకాహారం. ఇందులో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఇది మీ కండరాలను బలంగా ఉంచడానికి, మీ ఆకలిని నియంత్రించడానికి సాయపడుతుంది. టర్కీలో విటమిన్లు, ఖనిజాలు అధికమొత్తంలో ఉంటాయి. నిద్రకి ముందు టర్కీ తింటే హ్యాపీగా నిద్రపోతారు అని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
టర్కీలో కొన్ని అద్భుత గుణాలు ఉన్నాయి. దాన్ని తినడం చాలా ముఖ్యం. ఇందులో ముఖ్యంగా అమైనో యాసిడ్స్ ట్రిప్టోఫాన్ ఉంటుంది. ఇది మెలటోనిన్ ఉత్పత్తిని పెంచుతుంది. నిద్రను మెరుగుపరచడంలో టర్కీ పాత్రను నిర్ధారించడానికి మరింత పరిశోధన అవసరం.
మీకు నిద్రలేమి సమస్యలు ఉంటే దీనిని మీ డైట్‌లో చేర్చుకోవడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. అయితే, ఎక్కువగా దీనిని తినడం అంత మంచిది కాదు. ఎందుకంటే.. ఇందులో ప్రోటీన్, ట్రిప్టోఫాన్ అధికంగా ఉంటాయి. ఇవి రెండూ అలసటకి కారణమవుతాయి. .
చమోమిలే టీ
చమోమిలే టీ మూలికాభరితమైన ఈ టీని తాగడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. దీనిని తాగడం వల్ల కాన్సర్, గుండె జబ్బులు వంటి వ్యాధులు దూరం అవుతాయని చెబుతున్నారు. ఇందులో ఎన్నో యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లేవనాయిడ్స్ కూడా ఉంటాయి.
చమోమిలే టీని తాగడం వల్ల రోగనిరోధక శక్తిని పెరుగుతుంది. ఆందోళన, నిరాశను తగ్గిస్తుందని, చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగు పరుస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. దీనిని తాగడం వల్ల హ్యాపీగా పడుకుంటారని చెబుతున్నారు. ప్రత్యేకంగా, చమోమిలే టీలో ఎపిజెనిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది నిద్రను ప్రోత్సహించి, నిద్రలేమిని తగ్గిస్తుంది. ఓ అధ్యయనం ప్రకారం 34 మంది పెద్దవారికి 28 రోజుల పాటు రోజుకు రెండుసార్లు 270 మి.గ్రా చొప్పున చమోమిలే టీని నిద్రకి 15 నిమిషాల ముందు తాగమన్నారు. ఇందులో టీ తాగని వారితో పోలిస్తే.. తాగిన వారు హ్యాపీగా నిద్రపోయారు.
మరో అధ్యయనం ప్రకారం, టీ తాగని వారితో పోలిస్తే, రెండు వారాల పాటు చమోమిలే టీ తాగిన మహిళలు హ్యాపీగా నిద్రపోయినట్లు తేలింది. చమోమిలే టీ తాగిన వారికి డిప్రెషన్ యొక్క లక్షణాలు తగ్గుతాయి. ఎందుకంటే, నిద్ర సమస్యలని దూరం చేస్తుంది. అందుకే మీరు నిద్రపోయే ముందు చమోమిలే టీ తాగడం అలవాటు చేసుకోండని చెబుతున్నారు నిపుణులు.
చమోమిలే టీలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి, దీనిని తాగడం వల్ల నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది.
.
కివి
కివీలో కేలరీలు తక్కువగా ఉంటాయి. అదేకాకుండా ఈ పండులో పోషకాలు మెండుగా ఉంటాయి. ఒక మీడియం కివిలో 50 కేలరీలు, గణనీయమైన పోషకాలు ఉన్నాయి. వీటిలో మీ రోజువారీ అవసరాలలో 117% విటమిన్ సి, 38 శాతం విటమిన్ కెలు ఉంటాయి. ఇందులో అధిక మొత్తంలో ఫోలేట్, పొటాషియం, అనేక ఖనిజాలను కలిగి ఉంటుంది. వీటిని తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అదేవిధంగా కడుపులో మంట తగ్గితుంది. దీంతో మీ కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుందని చెబుతున్నారు నిపుణులు. ఫైబర్, కెరోటినాయిడ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అధ్యయనాల ప్రకారం, నిద్ర నాణ్యతను మెరుగుపరిచే ఉత్తమమైన ఆహారాలలో కివీస్ కూడా ఒకటి. ఓ అధ్యయనం ప్రకారం కొంతమందికి ప్రతిరోజూ రాత్రి పడుకునే ఒక గంట ముందు రెండు కివి పండ్లని ఇచ్చారు. ఇందులో ఈ పండ్లు తిన్నవారు హ్యాపీగా పడుకున్నారు. తిననవారితో పోల్చితే.
కివీల్లోని యాంటీఆక్సిడెంట్స్, విటమిన్ సి, కెరోటినాయిడ్స్ కారణంగానే త్వరగా నిద్రపోతారని నిపుణులు చెబుతున్నారు.
టార్ట్ చెర్రీ జ్యూస్
టార్ట్ చెర్రీ జ్యూస్ ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఎక్కువగా విటమిన్ ఎ, విటమిన్ సి, మాంగనీస్‌లు ఉన్నాయి. వీటితో పాటు అధికంగా యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. ఆంథోసైనిన్స్,ఫ్లేవనోయిడ్స్ అధికంగా ఉన్నాయి. యాంటీఆక్సిడెంట్స్, డయాబెటిస్, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధులకు దారితీసే హానికరమైన కణాలను తగ్గిస్తుంది. అంతేకాకుండా దీనిని తాగడం వల్ల హ్యాపీగా నిద్ర పోతారు. నిద్రలేమి సమస్యను దూరం చేసుకోవాలనుకుంటే నిద్రపోవడానికి ముందు టార్ట్ చెర్రీ జ్యూస్ తాగడం మంచిదని చెబుతున్నారు.
వాల్‌నట్స్..
కొంతమందికి రాత్రుళ్లు అసలు నిద్ర పట్టదు. అలాంటి వారు వాల్‌నట్స్‌ని ప్రతిరోజూ తినడం అలవాటు చేసుకోవాలి. ఇందులో నిద్రకు సహకరించే మెలటోనిన్ అనే హార్మోన్ ఉంటుంది. వీటితో పాటు మెగ్నీషియం, మాంగనీస్ పుష్కలంగా ఉన్నాయి. అదనంగా వాల్‌నట్స్‌లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. వీటిలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, లినోలెయిక్ ఆమ్లం ఉన్నాయి. ఇవి ఆకలిని తగ్గించడానికి ఉపయోగపడతాయి. వాల్‌నట్స్ గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. వీటితో పాటు వాల్‌నట్స్ తింటే నిద్రకి కూడా మేలు చేస్తుందని చెబుుతన్నారు నిపుణులు. కాబట్టి పడుకునే ముందు కొన్ని వాల్నట్స్ తినడం మంచిది.
పాషన్ ఫ్లవర్ టీ
ఇది మరో మూలికా టీ. అనేక వ్యాధుల చికిత్సకు చాలా సంవత్సరాలుగా మందుగా పనిచేస్తుంది.
ఫ్లేవనాయిడ్ యాంటీ ఆక్సిడెంట్స్‌కి ఇది గొప్ప మూలం రోగనిరోధక శక్తిని పెంచడం, గుండె జబ్బులని దూరం చేయడంలో ఈ టీ బాగా పనిచేస్తుంది.
వైట్ రైస్
అనేక దేశాలలో ఎక్కువగా వాడే వైటర్ రైస్ కూడా చాలా మంచిది. తెలుపు, గోధుమ బియ్యం మధ్య ఉన్న ప్రధాన తేడా ఏంటంటే, ఇందులో ఫైబర్, పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు తక్కువగా ఉంటాయి. వీటిని నిద్ర పోయే ముందు కనీసం ఒక గంట ముందు తీసుకుంటే చాలు హ్యాపీగా నిద్రపోవచ్చు. తెల్ల బియ్యం తినడం నిద్రను ప్రోత్సహించడంలో ముఖ్య పాత్ర ఉన్నప్పటికీ, ఫైబర్, పోషకాలు లేకపోవడం వల్ల వీటిని తక్కువగా వాడతారు.
No comments:
Post a Comment